A Telugu literary creator specializing in “Mircheelu” – బత్తుల వీ వీ అప్పారావు

మిర్చీలు మిర్చీలు !!

నా గురుంచి నేను

AISF కార్యకలాపాల్లో, రాజకీయ పాఠశాలల్లో పాల్గొన్నాను. ఊహ వచ్చినప్పటి నుండి సిపిఐ ఉద్యమాలు, సాహిత్యం, పత్రికల ప్రభావం ఎక్కువ…

60+

Years of Experience

3000+

Mircheelu – Quotes

13,873 +

World-wide Readers

Over 16,000+ special readers love to read about mircheelu..

బత్తుల వీ వీ అప్పారావు (Bathula VV Apparao)

The author is known for creating a unique style of short, sharp, and witty sayings referred to as “మిర్చీలు మిర్చీలు” (Mircheelu – meaning “Chillies” in Telugu). These are essentially impactful one-liners or satirical remarks that aim to provoke thought, humor, or reflection. His work spans across social commentary, human nature, and cultural observations.

New

A unique style of short, sharp, and witty sayings…

మిర్చీలు మిర్చీలు"

These are essentially impactful one-liners or satirical remarks that aim to provoke thought, humor, or reflection.

మనుషులపై మిర్చీలు

పక్షులపై మిర్చీలు

Punch & Pinch

Style: Sharp, witty, and metaphorical.

Tone: Satirical yet thought-provoking.

Medium: Primarily books and digital downloads.

Bathula VV Apparao

www.BathulaVVApparao.com

"నాడు భర్త పోతే/ సతీ సహగమనం, నేడు ఆడబిడ్డ అయితే/ కడుపులోనే హననం. ప్రకృతి ప్రతిరూపం పై ఎంత కిరాతకం?"

బత్తుల వీ వీ అప్పారావు (Bathula VV Apparao)

Author / Writer

Positive feedback

See what our reader's saying

4.9 Rated

4.9/5

ఈ వేసవి ఎండకు మల్లే మెదడును సుర్రున తాకుతున్నాయి … మీ ప్రతి మాట

Ramakrishna

Atmakuru 

5.0 Rated

5/5

My Hearty thanks sir For marvelous presentation of truth. Everyone should realize the truth through going your mircheele mircheelu. I wish reader should go through with open mind to feel the greatness of messages.

Venkatesu

Gaduputi

4.8 Rated

4.8/5

Namaskaram Mee Kavitwam linkulu pampinanduku kruthajnathalu Mee Mircheelu entha ghaatugaa unnaayo antha bhaavasphorakamgaa kooda unnaayi. Idee mee kavitha prathyekatha Neti kaalam lo rachanallo samajam undigaanee bhaavukatha koravadindi. Meeraa lotunu poorthika theerustunnaaru. Haardika Abhinandanalu– saatyaki

Saatyaki

@henryblrd

4.9 Rated

4.9/5

మిర్చీ కవిత్వంలో పక్షులు, మనుషులు–తంగిరాల చక్రవర్తి, సాహితీ కిరాణం మాస పత్రిక, మార్చి 2016 సంచిక

 మిర్చీ కవిత్వంలో పక్షులు,మనుషులు

పెద్దూరి  వెంకట దాసు సంపాద కత్వంలో వెలువడిన ఈ కవితా సంపుటిని రావి రంగారావు గారికి అంకితం చేశారు. ఈ పుస్తకంలో ని ఏక వాక్య కవితలన్నీ అద్భుత భావ దారలతో ఉన్నాయి. “నిన్న జై జై సత్యం, నేడు జైలు సత్యం”, “ట్వెంటీ ట్వెంటీ కాదు, ఫోర్ ట్వెంటీ” అంటూ క్రికెట్ మర్మాలు ఏక వాక్యంలో చెప్పారు బత్తుల వీవీ అప్పారావు. తెలుగు సాహిత్యంలో వామన కవితల్లో ఈ ఏక వాక్య మిర్చీ కవితలు విశిష్ట స్థానం పొందు తాయి. “ఊరితే నుయ్యి, ఆగితే గొయ్యి”, “వోటింగ్ పవిత్రం, వి ఐ పీ లకు స్పెషల్ క్యూలు ఉండవు” అని మనుషు లపై మిర్చీలు విరజిమ్మారు.

పక్షులపైన మిర్చీలలో కొన్నిటిని చూద్దాం. “అడవులే స్వర్గం, నరికితే నరకం”. “చీమలు నిద్ర పోవు. అవి 24 x 7 శ్రమ జీవులు”. “జంతువులది గడ్డి, మనుషు లది నానా గడ్డి”. ఈ పక్షుల విభాగాన్ని ముత్తేవి రవీంద్రనాథ్ గారికి అంకితం చేశారు. ఎన్. వి. రఘు వీర్ ప్రతాప్, పెద్దూరి వెంకట దాసులు ముందు మాటలు రాశారు. మనిషి మానవతను కలంతో పలకరించే బత్తుల వారికి అభినందనలు—తంగిరాల చక్రవర్తి, సాహితీ కిరణం మాస పత్రిక, మార్చి 2016 సంచిక

అర్థవంత మైన అక్షర మిర్చీలు

తంగిరాల చక్రవర్తి (వార్త దిన పత్రిక 28/2/2016 నుంచి)

4.8 Rated

4.8/5

అర్థవంత మైన అక్షర మిర్చీలు

“మనుషులపై/పక్షులపై మిర్చీలు” పేరిట బత్తుల వీవీ అప్పారావు వెలువరించిన మినీ కవితా సంకలనం లోని కవితలు అర్థవంతంగా ఉన్నాయి. మనుషులపై మిర్చీల్లో మచ్చుకు కొన్ని: “కథల్లో కారా, రాతల్లో చేరా, అని పిస్తారు ఔరా. “కొడుకు పుట్టాడు, లెనిన్ అవుతాడో, లాడెన్ అవుతాడో”. ఇక పక్షులపై మిర్చీల్లో“ఏనుగులది జంతు ప్రేమ, మాంసాహారం ముట్టవు”. “నిన్న అడవుల్లో, నేడు జూల్లో, రేపు బొమ్మల్లో—పక్షులు, జంతువులు”. సహిస్తే గొర్రెలు. కలహిస్తే గొరిల్లాలు”. ఇలా ఏక వాక్య కవితలు పాఠ కుల్ని అలరిస్తాయి– తంగిరాల చక్రవర్తి (వార్త దిన పత్రిక 28/2/2016 నుంచి) 

అర్థవంత మైన అక్షర మిర్చీలు

తంగిరాల చక్రవర్తి (వార్త దిన పత్రిక 28/2/2016 నుంచి)

5.0 Rated

5/5

ఉభయ కుశ లోపరి. మీరు పంపిన మనుషులపై మిర్చీలు అందడం, చదవడం జరిగింది. మంచి రచన. ఏ దైనా ఉపన్యాసం లో గాని, వ్యాసంలో గాని ఉదహరించేందుకు ఉపకరించే అంశాలు చాలా కనిపించాయి. అభినందనలు. ఈ సారి వచ్చినప్పుడు తప్పక కలుస్తాను– ఎస్‌ఆర్ పృధ్వి

ఎస్‌ఆర్ పృధ్వి

ఆత్మీయ మిత్రులు శ్రీ బత్తుల వీవీ అపారావు గారికి నమస్సులు.

5.0 Rated

5/5

బత్తుల వివి అప్పారావు గారికి,

మీరు రచించి ప్రచురించిన మనుషులపై/పక్షులపై మిర్చీలు గ్రంథాన్ని అందుకున్నాను. సంతోషం. మీ గ్రంథంలో సూక్తులున్నాయి. ఘాటైన చలోక్తు లున్నాయి.

నిత్య జీవితం లో సందర్భోచితం గా ఉదహరించదగిన  పంక్తులెన్నో వున్నాయి. మీ వినూతన రచనా శక్తికి నా ఆశీరభి నందనలు. ఉంటాను–డా. సి నారాయణ రెడ్డి

డా. సి నారాయణ రెడ్డి

అభినందన

4.9 Rated

4.9/5

Dear Sri Bathula VV Apparao,

Namaste.  Received your book “manushulapai mircheelu” and “pakshulapai mircheelu”. The book is good, humorous, informative and educative also. Thank u very much.  As per my calculation 412+1283 =1695 quotations are in your book. I want to translate after selection 500 or 600 quotations into Kannada, if possible by book form before January or February 2016. Today Mr A Bhaskar talked to me by phone to send mircheelu for meanings. Now I wish to state that I have Telugu-English Dictionary. So I will manage myself for meanings. So please send permission  letter to translate the book into Kannada language—KL Ranganatharao.

KL Ranganatharao

5.0 Rated

5/5

మిర్చి మసాలా

కవి భావుకుడు. భావుకతకు ప్రతిభ, వ్యుత్పన్నత అవసరం. సాధన ద్వారానే అది సాధ్యం. తిర్యగ్జంతువులకు మానవులకు వున్న తేడా ఏమీ లేదు. ఆహార నిద్ర భయ మైధునాలు సమానం. కానీ మానవుడికి బుద్ధి బలాన్ని ప్రసాదించాడు భగవంతుడు. ఆ బుద్ధి బలాన్ని  కొందరు కవితలలోను, మరికొందరు చిత్రాలలోనూ, మరి కొందరు సంగీతం లోనూ వికసింప చేస్తారు. అట్టి వారిలో  అప్పారావు ప్రముఖులు.

సమసమాజ స్థాపన ధ్యేయంగా సామ్యవాద సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. పదిమందికి సహకరించే      కళ్యాణ వేదికలు ఏర్పాటు చేశారు. ఈ గ్రంథ ద్వంద్వం లో పక్షుల నుద్దేశించి నాలుగు వందల కు పైగా మిర్చీలు ధట్టించారు.

“పుట్టల్లో పాములు, పాలిటిక్స్ లో స్క్యాములు” అనే ఒక్క మిర్చీకి భగవత్ గీత కున్నంత వ్యాఖ్యానం చేయవచ్చు. వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు లాక్షణికులు. ఈ రెండు పద బంధాలలో అప్పారావు తన సమాజ రుణాన్ని తీర్చుకున్నారు.

కళ్ళు మూస్తే పడక, కన్ను మూస్తే పాడె” అనే వైరాగ్య భరిత వ్యాఖ్య తల పండిన పీఠాధిపతులు, రుషితుల్యులు చెప్ప గలిగిన మాట.  ఎంత శ్రీ మంతుడైనా స్మశాన ప్రయాణం చేయక తప్పదు. ఎంతటి ఆత్మీయత, అనుబంధం కలిగిన బంధువునైనా చనిపోయిన 24 గంటలలో అంతిమ ప్రయాణానికి సిద్ధం చేస్తారు. బ్రతికి వున్నంతలో అతడు చేసిన మేలు మాత్రమే లోకం లో మిగిలి పోతుంది.

భావ బలం, అక్షర సంపద ఉంటే తప్ప ఆలతి ఆలతి పదాలలో అక్షర రమ్యత చూపడం సాధ్యం కాదు. అధ్బుతమైన భావ ప్రవాహంలో గంగా ఝరి లా ప్రవహించిన కవితా రస ధార ఈ సంపుటి.

పదాలు వాటి అంతట అవే అహమహమికలో పరుగులు తీశాయి. వీరి కలం మరింత ప్రగాఢమై తెలుగు జాతికి మరింత ఘాటైన మిర్చీమసాలా అందించాలని ఆకాంక్ష—డా. ఆర్ అనంతపద్మనాభ రావు.  

మిర్చి మసాలా

R అనంత పద్మనాభ రావు